Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దూరు లో నేలకూలిన భారీ వృక్షం ట్రాఫిక్ అంతరాయం

Follow Udayam on Google
Sircilla jilla news Aug 24, 2026 8:46 PM రాజన్న సిరిసిల్లGeneral
పెద్దూరు లో నేలకూలిన భారీ వృక్షం ట్రాఫిక్ అంతరాయం - Udayam
సిరిసిల్ల మండలం పెద్దూరు గ్రామ శివారులోని సిరిసిల్ల, కామారెడ్డి ప్రధాన రహదారి పక్కన భారీ వృక్షం సోమవారం మధ్యాహ్నం నేలకూలింది. దీంతో రహదారి పక్కన కొంతసేపు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అదృష్టవశాత్తు చెట్టు కూలిన సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న స్థానికులు చెట్టు తొలగింపు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరారు.

Comments

G
Loading comments...