వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలోని అన్ని పాఠశాలలకు గురువారం కలెక్టర్ కోయ శ్రీహర్ష సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న పరిస్థితుల్లో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఈ చర్యలు చేపట్టారు. నేటి సెలవుకు బదులుగా వచ్చే రెండో శనివారం పాఠశాలలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
Comments
Loading comments...
