వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ హనుమద్గిరి పద్మాక్షి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. 11న శైలపుత్రి, 12న బ్రహ్మచారిణి, 13న చంద్రఘంటా, 14న కూష్మాండ,15న స్కందమాత, 16న కాత్యాయని, 17న కాళరాత్రి అలంకరణల్లో అమ్మవారు దర్శనమివ్వనున్నారు.
ఈ నెల 21న రథోత్సవం, 22న శాంతి కల్యాణం, తెప్పోత్సవం నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని దేవస్థాన నిర్వాహకులు కోరారు.
Comments
Loading comments...

