Back to feed
‘OG 2’పై పవన్ కళ్యాణ్ నిర్మాణ సంస్థ క్రేజీ అప్‌డేట్!
Ravish Kumar Jun 13, 2026 6:24 AM అల్ ఇండియా 12 views2 days ago

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన ‘OG’ భారీ విజయం సాధించిన నేపథ్యంలో పార్ట్-2పై స్పష్టత వచ్చింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ధృవీకరించడంతో అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.
ప్రస్తుతం విదేశాల్లో ఉన్న దర్శకుడు సుజీత్ తిరిగి రాగానే ఈ చిత్రంపై చర్చలు జరపనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ‘OG’ చిత్రానికి ప్రీక్వెల్‌గా, జపాన్ నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ కథాంశంతో ఈ సరికొత్త పార్ట్-2 రూపుదిద్దుకోనుందని సమాచారం.
Comments
Loading comments...



