Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరాగ్‌కు భుజం సర్జరీ సక్సెస్

Follow Udayam on Google
Vikram Jun 11, 2026 4:41 PM జాతీయంక్రీడలు
పరాగ్‌కు భుజం సర్జరీ సక్సెస్ - Udayam
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌కు భుజం సర్జరీ విజయవంతంగా పూర్తయింది. గాయం కారణంగా ఆయన ఇండియా-A జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా ఐసీయూ బెడ్‌పై ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, త్వరలోనే మైదానంలో కలుద్దామని పరాగ్ పేర్కొన్నారు. గత రెండేళ్లుగా భుజం నొప్పితో బాధపడుతున్న ఆయన ఎట్టకేలకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు.

Comments

G
Loading comments...