వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలో మరో పాకిస్థానీ పౌరుడు రయీస్ ఖాన్‌ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. ఇటీవల వరుసగా చొరబాటు ఘటనలు జరుగుతుండటంతో సరిహద్దుల్లో భద్రతను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు.
అతని వద్ద ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు. నిందితుడిని ప్రశ్నిస్తూ, అతను పొరపాటున వచ్చాడా లేదా ఉద్దేశపూర్వకంగా చొరబడ్డాడా అనే కోణంలో భద్రతా బలగాలు విచారణ జరుపుతున్నాయి.
Comments
Loading comments...

