Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివి

Follow Udayam on Google
madhu Aug 31, 2026 7:05 PM ములుగుGeneral
పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివి - Udayam
శుభకార్యాల విజయవంతానికి నిశ్శబ్దంగా సేవలందించే పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన కత్తి మొగిలి కుటుంబ సభ్యులు వినూత్నంగా సత్కరించారు. ఇటీవల కుమార్తె వివాహ వేడుకలో పరిశుభ్రత కోసం సేవలందించిన కార్మికులకు నూతన వధూవరుల చేతుల మీదుగా చీరలను అందజేశారు. వేడుకల వెనుక పారిశుధ్య కార్మికుల శ్రమ ఎంతో కీలకమని, వారి సేవలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మొగిలి తెలిపారు.

Comments

G
Loading comments...