Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒత్తిడి లేని జీవితాన్ని అలవాటు చేసుకోవాలి

Follow Udayam on Google
K Anuradha Sep 10, 2026 3:36 PM శ్రీకాకుళంGeneral
ఒత్తిడి లేని జీవితాన్ని అలవాటు చేసుకోవాలి - Udayam
ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం పలాస ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వైద్యులు, సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పాపినాయుడు మాట్లాడుతూ బాల్యం నుంచే చిన్నారులకు ఒత్తిడిలేని జీవన విధానాన్ని అలవాటు చేయాలన్నారు. మానసిక సమస్యలు, ఒత్తిడి ఉంటే ప్రభుత్వ టెలీ-మానస్‌ 14416 నంబర్‌కు ఫోన్‌ చేసి ఉచిత వైద్య సలహాలు పొందాలని తెలిపారు.

Comments

G
Loading comments...