వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్ర నుంచి దిగుబడులు తగ్గడంతో మలక్‌పేట మార్కెట్‌లో ఉల్లి ధరలు పెరిగాయి. గతంలో రూ. 1,100 ఉన్న క్వింటా ధర, ప్రస్తుతం రూ. 2 వేలకు చేరుకుంది. మార్కెట్‌కు వస్తున్న సరుకు భారీగా తగ్గిందని అధికారులు తెలిపారు.
సీజన్ ముగియడం మరియు వర్షాల వల్ల రాబడి తగ్గడంతో ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం ధరలు పెరుగుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంట తడవకుండా మార్కెట్ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Comments
Loading comments...

