వార్తలకు తిరిగి వెళ్లండి
నకిలీ విత్తనాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కౌలు రైతు సంఘం జిల్లా కార్య దర్శి రాకోటి రాములు కోరారు. సోమవారం విజయనగరం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన నిరసనలో ఆయన మాట్లాడారు.
జిల్లాలోని 3 మండలాల్లో 600 మంది రైతులు నకిలీ విత్తనాల కారణంగా పంట నష్టపోయారని ఆరోపించారు. నకిలీ విత్తనాలు విక్రయించిన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని, మెంటాడ మండలంలో రైతు భరోసా సమస్యను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

