Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో చాకలి ఐలమ్మ వర్ధంతి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 10, 2026 2:38 PM నిర్మల్General
నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో చాకలి ఐలమ్మ వర్ధంతి - Udayam
కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ముందుగా అదనపు కలెక్టర్, అధికారులతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐలమ్మ పోరాటాలను గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మ పాత్ర కీలకమైనదని తెలిపారు

Comments

G
Loading comments...