వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటిని దుర్వినియోగం చేసినందుకు ప్యారడైజ్ హోటల్ యాజమాన్యానికి జలమండలి రూ.20 వేల జరిమానా విధించింది. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని డివిజన్–16 అధికారులు నిర్వహించిన తనిఖీల్లో హోటల్లో నీటి దుర్వినియోగాన్ని గుర్తించారు.
భవిష్యత్తులో తాగునీటిని పొదుపుగా వినియోగించాలని యాజమాన్యానికి సూచించారు. నీటిని వృథా చేస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

