వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిడదవోలులోని వార్డులు, పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాలను ఎస్పీ డి. నరసింహ కిషోర్ పరిశీలించారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ఇద్దరు డీఎస్పీలు, సాయుధ బలగాలను మోహరించినట్లు తెలిపారు.
సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, పోలింగ్ రోజున 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. కేంద్రాల 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు పాటించాలని సూచించారు.
Comments
Loading comments...

