Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరల్డ్‌కప్‌ : న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్

Follow Udayam on Google
Ravi Jun 14, 2026 8:42 AM జాతీయంక్రీడలు
వరల్డ్‌కప్‌ : న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్ - Udayam
మహిళల టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో న్యూజిలాండ్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులు చేయగా, విండీస్ బౌలర్ అలియా అల్లెన్ నాలుగు వికెట్లతో అద్భుత ప్రదర్శన చేసింది. అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 19.5 ఓవర్లలో ఛేదించింది. షెమెన్ క్యాంప్‌బెల్ 90 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించింది. మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా విజయం సాధించింది.

Comments

G
Loading comments...