వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు DMHO కార్యాలయంలో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. NHM విభాగంలోని ఓ అధికారి 22 అర్బన్ PHCల వైద్యులు, నర్సుల నుంచి నెలకు రూ.3 వేలు, రూ.500 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
డబ్బులు ఇస్తే విధులకు హాజరుకాకపోయినా దొంగ సంతకాలతో జీతాలు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ డాక్టర్ రెండు నెలలు విధులకు రాకపోయినా జీతం పొందాడనే ఆరోపణలు ఉన్నాయి.
Comments
Loading comments...

