వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ పాతపేట ఉప్పరకట్ట వద్ద పెద్దమ్మ అవ్వ దేవాలయం 16వ వార్షికోత్సవం గురువారం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు ఉప్పర భాస్కర్, ఉప్పర రవి, ఉప్పర నాగేష్, ఉప్పర నరసింహమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గురువారం ఉదయం పూజలు, హోమం, ఆరాధన ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
Comments
Loading comments...

