Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నౌపడలో 215 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు

Follow Udayam on Google
Hari Sep 30, 2026 5:40 PM శ్రీకాకుళంGeneral
నౌపడలో 215 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు - Udayam
సంతబొమ్మాళి మండలం నౌపాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో 215 మంది విద్యార్థులకు బుధవారం కంటి పరీక్షలు నిర్వహించారు. ఆప్తాలమిక్ అధికారి ఎం.ఆర్.కే. దాస్ పరీక్షించి 34 మంది విద్యార్థులకు దృష్టిలోపం గుర్తించి ఉచిత కళ్లద్దాలకు సిఫార్సు చేశారు. సెల్ఫోన్ వినియోగం తగ్గించి, సరైన వెలుతురులో చదవాలని సూచించారు. దృష్టిలోపం ఉన్నవారు ఏటా కంటి పరీక్ష చేయించుకోవాలన్నారు.

Comments

G
Loading comments...