వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్ మండలం నార్నూర్ ఎక్స్ రోడ్డు వద్ద బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. గాదిగూడ, నార్నూర్, ఆసిఫాబాద్ వైపు వెళ్లేవారు నీడ లేక ఎండలో నిలబడాల్సి వస్తోందని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆసిఫాబాద్ నుంచి వచ్చే ఎక్స్‌ప్రెస్ బస్సులు ఇక్కడ ఆగడం లేదని తెలిపారు. అన్ని బస్సులకు స్టాపింగ్ కేటాయించి, బస్ షెల్టర్ నిర్మించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

