Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబైలో ఆటో, ట్యాక్సీ ఛార్జీల మోత

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 9:29 PM ఆల్ ఇండియా జాతీయ
ముంబైలో ఆటో, ట్యాక్సీ ఛార్జీల మోత - Udayam
ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో ఆటో, ట్యాక్సీ ఛార్జీలు పెరిగే అవకాశముంది. ట్యాక్సీ కనీస ఛార్జీ రూ.31 నుంచి రూ.33 లేదా రూ.34కు, ఆటో ఛార్జీ రూ.26 నుంచి రూ.27కు పెరగనుంది. రవాణాశాఖ ప్రతిపాదనను ప్రాంతీయ ట్రాన్స్‌పోర్టు అథారిటీకి పంపింది. ఆమోదం లభించగానే కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. ఇంధన ధరలు, నిర్వహణ వ్యయం పెరగడంతో ఛార్జీల పెంపునకు అనుమతించాలని యూనియన్లు కోరాయి.

Comments

G
Loading comments...