Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 04, 2026 3:58 PM జాతీయంGeneral
జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు - Udayam
ఈ ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుండి ఆగస్టు 13 వరకు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ సమావేశాల్లో దేశ ప్రాధాన్య అంశాలపై విస్తృత చర్చలు, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రిజిజు పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాలపై అర్థవంతమైన చర్చలు జరగాలని ఆయన ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...