వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ చిత్రంలో నటించడం ఎంతో సంతోషంగా ఉందని కథానాయిక శ్రీనిధి శెట్టి తెలిపారు. తల్లి పాత్ర అనే కారణంతో మంచి కథలను దూరం చేసుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ సినిమా ఒప్పుకున్నానని చెప్పారు.
ఈ చిత్రం క్రైమ్, డార్క్ కామెడీ మేళవింపుగా ఉంటుందని, త్రివిక్రమ్ సంభాషణలు, వెంకటేశ్ నటన ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయని ఆమె స్పష్టం చేశారు.
Comments
Loading comments...

