వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాల మండలంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఫర్టిలైజర్ విక్రయ యాప్ లో యూరియా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియక రైతులు ప్రతిక్షణం తమ ఫోన్లోని యాప్ ను తెరిచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
తీరా అతి కష్టం మీద బుక్ చేసుకున్న యూరియాను కూడా సేకరించేందుకు రైతులకు తిప్పలు తప్పడం లేదు. మండల కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్ షాపుకు బుధవారం యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో అక్కడకు తరలివచ్చారు.
Comments
Loading comments...

