వార్తలకు తిరిగి వెళ్లండి

మాకవరపాలెం మండలం బూరుగుపాలెంకు చెందిన విద్యార్థిని షర్మిల మల్లఖంబ్ క్రీడలో ప్రతిభ కనబరిచింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని జాతీయస్థాయి ఎంపికకు అర్హత సాధించింది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మహాలక్ష్మి, ఉపాధ్యాయులు శుక్రవారం షర్మిలను రూ.5 వేల నగదు బహుమతితో సత్కరించి అభినందించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

