Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదో తరగతికి ‘మిషన్ మార్చి ఎస్‌ఎస్‌సీ-2027’ ప్రారంభం

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 30, 2026 12:08 PM బాపట్లGeneral
పదో తరగతికి ‘మిషన్ మార్చి ఎస్‌ఎస్‌సీ-2027’ ప్రారంభం - Udayam
పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా విద్యాశాఖ ‘మిషన్ మార్చి ఎస్‌ఎస్‌సీ-2027’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నవంబరు 30 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం ప్రత్యేక బోధనతో పాటు సబ్జెక్టుల వారీగా 20 మార్కుల స్లిప్ టెస్టులు పెడతారు. విద్యార్థుల సామర్థ్యాలను పెంచి మెరుగైన ఫలితాలు సాధించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.

Comments

G
Loading comments...