వార్తలకు తిరిగి వెళ్లండి

కడ్తాల్‌లో మంత్రి సీతక్క పర్యటించి, టోల్ ప్లాజా వద్ద పండ్లు అమ్ముతున్న మహిళను ఆప్యాయంగా పలకరించారు. ఆమెతో మాట్లాడి పండ్ల ధరలు అడిగి తెలుసుకున్నారు. మామిడి, బొప్పాయి పండ్లు కొనుగోలు చేసి, తోపుడు బండిపై స్వయంగా తూకం వేసి అమ్మారు.
మంత్రి సామాన్య ప్రజలతో కలిసిపోయి వ్యవహరించిన తీరును చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. చాలామంది ఆమెతో సెల్ఫీలు తీసుకున్నారు. అనంతరం ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించారు.
Comments
Loading comments...

