వార్తలకు తిరిగి వెళ్లండి
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి
kumar Jun 22, 2026 5:07 AM అనంతపురం 2 viewsabout 3 hours ago

నార్పల మండలం నాయనపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాత్రి వేళ గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటంపల్లి గ్రామానికి చెందిన ఓబులేసు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
మృతుని కుమారుడు ప్రవీణ్ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అతనికి స్థానిక ఆసుపత్రిలో అత్యవసర చికిత్స కొనసాగుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
Comments
Loading comments...