Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుల ప్రత్యేక పూజలు

Kumar Jun 22, 2026 6:04 AM చిత్తూరు 2 viewsabout 2 hours ago
ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ ఇల్లూరి లక్ష్మి సోమవారం శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముక్కంటి సన్నిధిలో ఆమె రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు నిర్వహించి, స్వామి, అమ్మవార్ల ప్రత్యేక ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఈఓ శ్రీ వెంకటేశులు ఆమెను శేషవస్త్రాలతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు శ్రీ గుర్రప్ప శెట్టి, ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...