వార్తలకు తిరిగి వెళ్లండి
ముక్కంటి సన్నిధిలో మాజీ ఎంపీ సతీష్ చంద్ర మిశ్రా
Kumar Jun 22, 2026 6:10 AM చిత్తూరు 2 viewsabout 3 hours ago
మాజీ రాజ్యసభ సభ్యులు సతీష్ చంద్ర మిశ్రా సోమవారం శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముక్కంటి సన్నిధిలో ఆయన రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు నిర్వహించి, స్వామి, అమ్మవార్ల ప్రత్యేక ఆశీస్సులు అందుకున్నారు. ఈ పర్యటనలో ఆయనకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
ఆలయ ఈఓ వెంకటేశులు ఆయనను శేషవస్త్రాలతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, ఇతర ముఖ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...