Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్

Follow Udayam on Google
Suresh Jun 22, 2026 11:24 AM తిరుపతిGeneral
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ - Udayam
తెలంగాణ గవర్నర్ ప్రతాప్ శుక్ల సోమవారం వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. గవర్నర్ సుప్రభాత సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. డిప్యూటీ ఈవో లోకనాథం గవర్నర్‌కు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. శ్రీవారి ఆశీస్సులు పొందడంపై గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...