వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ: చిన్న వాల్గోట్ గ్రామంలో మహిళా సంఘ భవనానికి స్లాబ్ వేసే కార్యక్రమాన్ని సర్పంచ్ గణేష్, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ పనులను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
మహిళా సంఘాల సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలిపారు. కార్యక్రమంలో మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

