Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహానంది వ్యవసాయ కళాశాలలో భద్రతపై ఆందోళన

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 11:52 AM నంద్యాలGeneral
మహానంది వ్యవసాయ కళాశాలలో భద్రతపై ఆందోళన - Udayam
మహానంది వ్యవసాయ కళాశాల పరిపాలన విభాగంలో పట్టపగలే ల్యాప్‌టాప్ చోరీ జరిగినట్లు సమాచారం. సిబ్బంది అందరూ అక్కడే ఉండగానే ఓ విభాగానికి చెందిన ల్యాప్‌టాప్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు స్థానికులు, విద్యార్థులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై గురువారం మహానంది పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. కళాశాలలో భద్రతా లోపాలపై ఈ ఘటన చర్చకు దారితీసింది.

Comments

G
Loading comments...