వార్తలకు తిరిగి వెళ్లండి

‘బ్లింక్ డిజిటల్’ దాఖలు చేసిన కేసులో మెటాకు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అకౌంట్ల రద్దుతో నష్టం జరిగిందని, రూ.1,158 కోట్ల పరిహారం కోరుతూ సంస్థ దావా వేసింది.
ఈ కేసును అమెరికా కోర్టులే విచారించాలన్న మెటా అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. భారత కోర్టుల పరిధిలోనే కేసు కొనసాగుతుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణ నవంబర్ 2న జరగనుంది.
Comments
Loading comments...

