Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొందమాల్‌లో మావోయిస్టుల డంప్‌ స్వాధీనం

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 2:37 PM జాతీయంGeneral
కొందమాల్‌లో మావోయిస్టుల డంప్‌ స్వాధీనం - Udayam
ఒడిశాలోని కొందమాల్‌ జిల్లా దారింగిబాడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మావోయిస్టుల డంప్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మత్రాబాడి అటవీ ప్రాంతంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా శనివారం ఈ డంప్‌ను గుర్తించాయి. రెండు రైఫిళ్లు, తూటాలు, డిటోనేటర్లు, టిఫిన్‌ బాంబులు, గ్రనేడ్లు తదితర మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...