వార్తలకు తిరిగి వెళ్లండి
మణిపూర్‌లో భారీ డ్రగ్స్ కలకలం

మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలో భారీగా తరలిస్తున్న సుమారు 49.5 కిలోల నల్లమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం ఇంఫాల్-దిమాపూర్ జాతీయ రహదారి-2 (NH-2) పై తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ డ్రగ్స్ వ్యవహారం వెలుగుచూసింది.
పోలీసులు నాకా తనిఖీలు చేస్తుండగా వేగంగా వచ్చిన ఒక కారును ఆపాల్సిందిగా సైగ చేశారు. అయితే పోలీసులను చూసి నిందితులు కారు ఆపకుండా పరారయ్యారు.
Comments
Loading comments...