Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో రేవంత్ రెడ్డి కీలక భేటీ

Follow Udayam on Google
శివ కుమార్ Jul 14, 2026 11:23 AM జాతీయంGeneral
ఢిల్లీలో రేవంత్ రెడ్డి కీలక భేటీ - Udayam
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక రహదారి ప్రాజెక్టుల పురోగతిపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణ పనులు, జాతీయ రహదారుల విస్తరణతో పాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల విడుదల అంశాలను కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు.

Comments

G
Loading comments...