వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల జిల్లా అమృతలూరు మండలంలో మైనర్ బాలికపై వేధింపుల కేసులో తెనాలి పోక్సో కోర్టు నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 70 ఏళ్ల సుబ్బారావుకు రూ.5,500 జరిమానా కూడా విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది.
2021 నవంబర్ 3న దీపావళి రోజు జరిగిన ఘటనపై అమృతలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది.
Comments
Loading comments...

