Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్లవాయిలో ‘జాగేయ్‌ మాతరి’ ఆచారం

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 10:11 AM ఆసిఫాబాద్General
మార్లవాయిలో ‘జాగేయ్‌ మాతరి’ ఆచారం - Udayam
మార్లవాయి గ్రామంలో ఆదివాసీలు పొలాల అమావాస్య అనంతరం తరతరాలుగా ‘జాగేయ్‌ మాతరి’ ఆచారాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామ శివారులోని పొలిమేర వద్ద ఇప్పచెట్టు వంటి పవిత్ర చెట్ల కింద వెదురు గుర్రాలను ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి కుటుంబం తెచ్చిన నైవేద్యాలను ఒకచోట చేర్చి పరస్పరం పంచుకుంటారు. అనంతరం గ్రామస్థులు సామూహికంగా భోజనం చేస్తారు.

Comments

G
Loading comments...