వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ అదాలత్ కూడలిలోని లింగాల కేదారి హోటల్‌లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు సమాచారం.
తీవ్ర గాయాలతో హోటల్ యజమాని కేదారి మృతి చెందగా, ఆయన భార్య పుష్పలతకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

