వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ మండలం చీటకోడూరులో విద్యుత్ సమస్యను సరిచేసేందుకు స్తంభం ఎక్కిన లైన్‌మెన్ రాధమల్ల కరుణాకర్ రెడ్డి షాక్‌కు గురై కిందపడి మృతి చెందారు. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కరుణాకర్ రెడ్డి మరణంతో కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
Comments
Loading comments...

