వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దొంగతనాలకు పాల్పడిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ. 16 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు పలువురు హిస్టరీషీటర్లని, లాక్ చేసిన ఇళ్లు, ఆలయాలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.
Comments
Loading comments...

