Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీసిటీలో భారీ పరిశ్రమ ఏర్పాటు

ధనుష్ రెడ్డి Jun 30, 2026 6:52 AM చిత్తూరు 2 viewsabout 2 hours ago
శ్రీసిటీలో భారీ పరిశ్రమ ఏర్పాటు - Udayam Digital
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో రూ. 445 కోట్ల భారీ పెట్టుబడితో ఏసీలు మరియు విడిభాగాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ తయారీ విధానం కింద ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించారు. ఈ కొత్త పరిశ్రమ అందుబాటులోకి రావడం ద్వారా స్థానికంగా 1,250 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఈ భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలను మంజూరు చేసింది.

Comments

G
Loading comments...