Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనధికారిక టెస్టులో కుషాగ్ర సెంచరీ

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 20, 2026 9:44 PM జాతీయంక్రీడలు
అనధికారిక టెస్టులో కుషాగ్ర సెంచరీ - Udayam
శ్రీలంక అండర్‌-19 జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత యువ జట్టు తొలిరోజే పట్టు బిగించింది. ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ అయినప్పటికీ, వన్‌డౌన్ బ్యాటర్ కుషాగ్ర ఓఝా (103 నాటౌట్) అజేయ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. కెప్టెన్ యశ్‌బర్దన్, మనాల్ చౌహన్ అర్ధశతకాలతో రాణించారు.

Comments

G
Loading comments...