వార్తలకు తిరిగి వెళ్లండి

కుంటాల మండలం కల్లూరు గ్రామంలోని కళాశాలలో విద్యార్థినులు ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయ దుస్తుల్లో పాటలు పాడుతూ కోలాటంతో సందడి చేశారు.
అనంతరం స్థానిక చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

