వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ లోని జగిత్యాల రోడ్డులో ఉన్న విశ్వ బేకరీ లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
బేకరీ నుంచి ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఫైర్ ఇంజన్‌తో అక్కడకు చేరుకుని శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాద కారణాలపై విచారణ జరుపుతున్నారు.
Comments
Loading comments...

