వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ మండలంలోని కొత్తపేట-బావాపూర్ మధ్య హనుమాన్ ఆలయం వద్ద బీటీ రోడ్డు వరద నీటికి కోతకు గురైంది. వంతెనకు ఇరువైపులా గైడ్‌వాల్ లేకపోవడంతో రహదారి ఓ వైపు పూర్తిగా దెబ్బతింది.
ప్రధాన రహదారి కావడంతో నిత్యం ద్విచక్ర వాహనాలు, ఆటోలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రమాదాలు జరగకముందే అధికారులు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరారు.
Comments
Loading comments...

