Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోతకు గురైన రోడ్డు.. ప్రమాదాల అంచున వాహనదారులు

Follow Udayam on Google
Naresh Aug 24, 2026 10:39 AM నిర్మల్General
కోతకు గురైన రోడ్డు.. ప్రమాదాల అంచున వాహనదారులు - Udayam
కుబీర్ మండలం బ్రహ్మేశ్వర్, మర్లగొండ రోడ్డు గతేడాది వర్షాలకు సగం వరకు కోతకు గురికావడంతో ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. మహారాష్ట్రకు వెళ్లే ఈ బీటీ రోడ్డుపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రోడ్డు అధ్వాన్నంగా మారడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, ప్రమాదాలు జరగకముందే ఈ రోడ్డుకు అత్యవసర మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...