Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోరమాండల్‌ లాభంలో తగ్గుదల

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 9:28 AM జాతీయంవాణిజ్యం
కోరమాండల్‌ లాభంలో తగ్గుదల - Udayam
కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.10,294 కోట్ల ఆదాయంపై రూ.523.37 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.793.44 కోట్ల లాభం వచ్చింది. పశ్చిమాసియా సంక్షోభంతో ముడిసరకు ధరలు పెరగడం, తగిన సబ్సిడీ అందకపోవడం మార్జిన్లపై ప్రభావం చూపాయని సంస్థ తెలిపింది. కొత్త ఎన్‌పీకే ఎరువుల ఉత్పత్తి సామర్థ్య విస్తరణ వచ్చే మార్చిలో పూర్తయ్యే అవకాశం ఉందని సీఈఓ తెలిపారు.

Comments

G
Loading comments...