Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాపురంలో నీట మునిగిన పంట పొలాలు

Follow Udayam on Google
Ganga Sep 25, 2026 12:56 PM పార్వతీపురం మన్యంGeneral
పాలకొండ మండలం కొండాపురంలో శుక్రవారం సుమారు 200 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. నాగావళికి వరద నీరు పోటెత్తడంతో ఈ నీరు కొండాపురం గ్రామంతో పాటు, సమీపంలో ఉన్న పంట పొలాలను ముంచెత్తింది. ఈ ఏడాది ఎన్నో అవస్థలు పడుతూ సాగు చేస్తుండగా అకాలంగా వచ్చిన వరదలు తమ పంట పొలాలను నాశనం చేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పంటలను పరిశీలించి తమను ఆదుకోవాలని కొండాపురం రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...