వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలతో కొమరాడ మండలం కల్లికోట గ్రామ సమీపంలో నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తోటపల్లి ప్రాజెక్టు నీరు వెనక్కి పోటెత్తడంతో వరి పొలాలు నీట మునిగాయి.
గత తుఫాన్‌లో పంటలు దెబ్బతినగా, ప్రస్తుతం చేతికొచ్చే దశలో ఉన్న మిగిలిన పంట కూడా నాశనమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

