Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి బస్టాండ్లో పనిచేయని ఫ్యాన్ లు

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 9:54 AM కామరెడ్డిGeneral
కామారెడ్డి బస్టాండ్లో పనిచేయని ఫ్యాన్ లు - Udayam
కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్లో సీలింగ్ ఫ్యాన్లు పనిచేయక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక కంట్రోలర్ బాక్స్ వద్ద మినహా ఎక్కడ ఫ్యాన్ లు తిరగడం లేదని ప్రయాణికులు తెలిపారు. ఉక్కపోతతో బస్సుల కోసం వేచి ఉండలేక అవస్థలు పడుతున్నామని వాపోయారు. నిత్యం భారీ సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే బస్టాండ్లో అధికారులు స్పందించి పనిచేయని ఫ్యాన్లకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...